November 22, 2021
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లైగర్ ప్రస్తుతం అమెరికాలోని లాస్‌వేగాస్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో అమెరికన్ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా అప్‌డేట్‌ల విషయంలో అటు విజయ్ ఇటు అనన్య ఇద్దరు పోటీ పడుతున్నారు. రీసెంట్ గా మైక్ టైసన్ షూటింగ్‌లో జాయిన్ అయిన సందర్భంగా అతనితో విజయ్, అనన్య, పూరి జగన్నాధ్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాజాగా షూటింగ్ గ్యాప్లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హార్స్ రైడింగ్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ ఫోటోలను అనన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఫోటోలను షేర్ చేస్తూ `హౌడీ రౌడీ` అని రాసుకొచ్చింది. అదే విధంగా ఇటీవల మైక్‌టైసన్‌తో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది అనన్య పాండే…
View this post on Instagram