April 25, 2022
Hari Hara Veeramallu: ఇటీవలే భీమ్లానాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌లో యాక్షన్స్ సీన్స్, టాకీపార్ట్ కంప్లీట్ చేస్తున్నారు. ఇందులో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాకుండా.. బాలీవుడ్ బ్యూటీ నపూర్ సనన్ కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇందులో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలకపాత్రలో నటించనుందట. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే కాకుండా.. కొన్ని సన్నివేశాల్లోనూ నోరా ఫతేహి కనిపించనుందని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట.
ఇది కూడా చదవండి: ఆచార్య సినిమాలో కాజల్ లేనట్లేనా?