ప‌ద్నాలుగేళ్ల‌యినా ప‌వ‌ర్ త‌గ్గ‌లేదు..4K, డాల్బీలో `జల్సా` రీ రిలీజ్‌కు అంతా సిద్దం

August 30, 2022

ప‌ద్నాలుగేళ్ల‌యినా ప‌వ‌ర్ త‌గ్గ‌లేదు..4K, డాల్బీలో `జల్సా` రీ రిలీజ్‌కు అంతా సిద్దం

ఈ మ‌ధ్య కాలంలో త‌మ అభిమాన హీరో పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌ సూప‌ర్‌హిట్ మూవీస్‌ని ఫోర్‌కే రెజుల్యూష‌న్‌తో రి రిలీజ్ చేయ‌డం కొత్త ట్రెండ్ గా మారింది. ఇప్పటికే మహేశ్‌బాబు పుట్టినరోజును కానుక‌గా ‘పోకిరి’, ‘ఒక్కడు’, చిరంజీవి బర్త్‌డేకి ‘ఘరానా మొగుడు’ చిత్రాలు రీ-రిలీజ్‌ అయ్యాయి. ఇక సెప్టెంబ‌రు 2 ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు కావ‌డంతో ప‌వ‌న్ బ‌ర్త్‌డే సందర్భంగా ‘జల్సా’ సినిమా ‘4K’ ప్రింట్‌తో సిద్ధమైంది సెప్టెంబరు 1న ఈ సినిమా మ‌ళ్లీ థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కానుంది.

సాయిధరమ్‌ తేజ్ ఈ చిత్ర ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి జల్సా.. రీరిలీజ్‌పై ఆనందం వ్యక్తం చేశారు. ట్రైలర్‌ విషయానికొస్తే.. మహేశ్‌బాబు చెప్పే వాయిస్‌ ఓవర్‌కు తగ్గట్టు సన్నివేశాలను ఎడిట్‌ చేసిన తీరు బాగుంది. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌, పాట‌ల క్లిప్పింగ్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇంకెందుకు ఆల‌స్యంలో 4కే లో విడుద‌లైన ట్రైల‌ర్ ఎలా ఉందో మీరు చూసేయండి.

ట్రెండింగ్ వార్తలు