ఘనంగా ఆశిష్ రెడ్డి రిసెప్షన్.. తరలివచ్చిన టాలీవుడ్ స్టార్స్!

February 24, 2024

ఘనంగా ఆశిష్ రెడ్డి రిసెప్షన్.. తరలివచ్చిన టాలీవుడ్ స్టార్స్!

దిల్ రాజు ఇంట పెళ్లి వేడుక జరిగిన సంగతి మనకు తెలిసిందే. తన సోదరుడు శిరీష్ కుమారుడు నటుడు ఆశిష్ రెడ్డి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అద్వైత రెడ్డితో ఆశిష్ ఏడడుగులు నడిచారు. వీరి వివాహం ఫిబ్రవరి 14వ తేదీ జైపూర్లో ఎంతో ఘనంగా జరిగింది.

ఇలా వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. అయితే దిల్ రాజు టాలీవుడ్ సెలబ్రిటీలను రాజకీయ నాయకులను వివాహ రిసెప్షన్ కి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇకపోతే శుక్రవారం సాయంత్రం వీరి వివాహ రిసెప్షన్ హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చారు. ఇలా సెలబ్రిటీల మొత్తం ఈ వేడుకకు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వివాహ రిసెప్షన్ కు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత రాయల్ లుక్ లో హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే ఈ వేడుకకు అక్కినేని నాగార్జున నాగచైతన్య హాజరయ్యారు. అలాగే మెగా హీరో రామ్ చరణ్ ఈ వేడుకలలో సందడి చేశారు. ఇక ఈ రిసెప్షన్ వేడుకకు రామ్ పోతినేనీ, నితిన్, అనిల్ రావిపూడి, డైరెక్టర్ శంకర్, అనసూయ వంటి పలువురు సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు.

ఇలా ఈ వేడుకకు కేవలం సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారని తెలుస్తుంది. ఈ వేడుకకు సెలబ్రిటీలందరూ తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నటువంటి ఈ హీరో త్వరలోనే తదుపరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Read More: చిన్నారుల ప్రాణాలను కాపాడిన మెగా హీరో.. మంచి మనస్సు అంటూ ప్రశంసలు?

ట్రెండింగ్ వార్తలు