లవ్ మీ అంటూ దెయ్యంతో ప్రేమలో పడిన ఆశిష్.. ఈఫ్ యు డేర్ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్!

February 28, 2024

లవ్ మీ అంటూ దెయ్యంతో ప్రేమలో పడిన ఆశిష్.. ఈఫ్ యు డేర్ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్!

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకుగా రౌడీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు హీరో ఆశిష్ రెడ్డి. ఈ సినిమా ఆశించినంత సక్సెస్ రాలేకపోయినప్పటికి ఆశిష్ నటన మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత సెల్ఫిష్ అనే సినిమాని మొదలు పెట్టాడు ఆశిష్. అయితే సినిమా మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అయినా ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు.

ఇప్పుడు లవ్ మీ అనే టైటిల్ తో మరో సినిమాలో హీరోగా నటిస్తున్నారు ఆశిష్ రెడ్డి. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు అరుణ్ భీమవరపు తో సినిమాను అనౌన్స్ చేశారు. ఇఫ్ యు డేర్ అనేది ఉప శీర్షిక. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను కూడా మంగళవారం అధికారికంగా రిలీజ్ చేశారు. పోస్టర్ ని చూస్తుంటే హీరో దెయ్యంతో ప్రేమలో పడతాడు అనిపిస్తుంది.

పోస్టర్ లో కూడా అదే విషయాన్ని మెన్షన్ చేశారు మేకర్స్. ఈ సినిమా ఆగస్టు 2023లో అధికారికంగా ప్రారంభించబడింది. ఈ సినిమా యొక్క ప్రాథమిక తారాగణం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి, నాగ మల్లిండి నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కి నవల రచయితగా మారిన చిత్ర నిర్మాత అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా పిసి శ్రీరామ్ వర్క్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఇక హీరో ఆశిష్ ఈ మధ్యనే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడివైనా సంగతి తెలిసిందే. అయితే మోషన్ పోస్టర్ చూసిన నెటిజన్స్ కొత్త పెళ్లికొడుకు దెయ్యంతో ప్రేమలో పడ్డాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: లండన్ లో ఇంటిని అద్దెకు తీసుకున్న ప్రభాస్.. నెల రెంట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ట్రెండింగ్ వార్తలు