రెండో పెళ్లి కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాము.. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

April 5, 2024

రెండో పెళ్లి కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాము.. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన డిస్ట్రిబ్యూటర్ గా తన సినీ ప్రయాణం మొదలుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా సినిమాలను నిర్మించే స్థాయికి చేరుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా కొనసాగుతూ ఉన్నటువంటి దిల్ రాజు తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీ స్థాయిలో నిర్వహించారు. అయితే మొదటిసారి దిల్ రాజు తన రెండో భార్య తేజస్విని కుమారుడితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తాను రెండో పెళ్లి చేసుకోవడంతో చాలామంది విమర్శలు కురిపించారని మమ్మల్ని ట్రోల్ చేశారంటూ ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇలా మా గురించి వచ్చిన ట్రోల్స్ చూసినటువంటి తేజస్విని చాలా బాధపడిందని దిల్ రాజు వెల్లడించారు. ఇలా తాను బాధపడుతూ ఉంటే తనకు నేను ఒకటే సలహా ఇచ్చానని ఈయన తెలియజేశారు.

నేనొక నిర్మాతగా ఒక కోటి మందికి తెలిసి ఉంటాను. ఆ కోటి మందిలో పదివేల మంది వరకు మన గురించి నెగిటివ్ కామెంట్లు చేశారు. మిగిలిన వారందరూ కూడా తమ పట్ల ప్రేమను చూపిస్తున్నారు. మనల్ని విమర్శించే ఈ పదివేల మంది గురించి ఆలోచించి బాధపడకూడదని మనల్ని ఇష్టపడే కొన్ని లక్షల మందిని అలా వదిలేయడం మూర్ఖత్వం. మనం ఎప్పుడూ కూడా నెగిటివిటీని తీసుకోకూడదు పాజిటివిటీని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అంటూ తనకు ధైర్యం చెప్పానని ఈ సందర్భంగా తన రెండో పెళ్లి గురించి వచ్చినటువంటి విమర్శలపై దిల్ రాజు స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Read More: బర్త్ డే స్పెషల్ పుష్ప 2 రష్మిక లుక్ వైరల్ …శ్రీవల్లి చాలా రిచ్?

ట్రెండింగ్ వార్తలు