పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్.. గెలుపు ఖాయమంటూ?

March 10, 2024

పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్.. గెలుపు ఖాయమంటూ?

రైతు బిడ్డగా మారుమూల గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో వీడియోలను షేర్ చేస్తూ యూట్యూబర్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో కూడా సింపతి డైలాగ్స్ కొడుకు మరోవైపు టాస్కులలో కష్టపడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని చివరికి విన్నర్ గా బయటకు వచ్చారు.

ఇక ప్రశాంత్ గెలిచాడు అన్న ఆనందం ఆయనకు రెండు రోజులు కూడా లేకుండా పోయింది గ్రాండ్ ఫినాలే రోజు తన అభిమానులు చేసినటువంటి పిచ్చి పనుల కారణంగా ఈయన ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇలా రెండు రోజుల పాటు జైలులో ఉన్నటువంటి ప్రశాంత్ ప్రస్తుతం పొలం పనులకు దూరంగా ఉన్నారు. పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసినటువంటి ఈయన ప్రస్తుతం తన గెటప్ మొత్తం మార్చేశారు.

మొత్తం వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనపడుతూ బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని ఖరీదైన కార్లలో కిర్రు కిరుమనే చెప్పులను వేసుకొని ఎంతో దర్జాగా తిరుగుతూ కనిపిస్తున్నారు. ఈయనను కనుక చూస్తే రాజకీయ నాయకులు గుర్తు రాకమానరు. అయితే ఈయన వ్యవహార శైలి కూడా రాజకీయ నాయకులు మాదిరిగానే ఉందని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లోకి గెలవడం కోసం సింపతీని క్యాష్ చేసుకున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా గెలిచే డబ్బును రైతుల కోసం ఇస్తానని మాట చెప్పారు.

ఇక ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత రాజకీయ నాయకులు ఎలాగైతే ఆ హామీలను మర్చిపోతారో పల్లవి ప్రశాంత్ కూడా రైతులకు డబ్బులను పంచడం పూర్తిగా మర్చిపోయారు. అయితే ఈయన నడవడిక చూస్తుంటే రాజకీయాలలోకి రావడం పక్కా అంటూ పలువురు భావిస్తున్నారు. అయితే ఈయన రాజకీయాలలోకి వస్తే ఏ పార్టీ తరఫున రాజకీయాలలోకి రాబోతున్నారు ఒకవేళ ఎంపీ ఎన్నికలలో పోటీ చేస్తే కనుక తప్పకుండా గెలుస్తారు అంటూ మరికొందరు ఈయన పట్ల చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More : సుద్దపూసని కుర్రాడి ఒకరోజు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ట్రెండింగ్ వార్తలు