రాజకీయాలలోకి పల్లవి ప్రశాంత్… వెళ్ళమని సలహా ఇచ్చిన శివాజీ?

February 15, 2024

రాజకీయాలలోకి పల్లవి ప్రశాంత్… వెళ్ళమని సలహా ఇచ్చిన శివాజీ?

పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు ఒక కామన్ మ్యాన్ గా రైతు బిడ్డగా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా మొదటి నుంచి కూడా ఎన్నో అంచనాలను పెంచుకుంటూ పోయినటువంటి ప్రశాంత్ చివరికి విన్నర్ గా నిలిచి బయటకు వచ్చారు. ఇక హౌస్ లో ఉన్నప్పుడు ఈయనని అమర్ టార్గెట్ చేయడంతో ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా ఈయన అభిమానులు చేసిన పనికి ప్రశాంత్ ఏకంగా జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితిలో ఏర్పడ్డాయి. ఇలా ఈ వివాదం ముగిసిన తర్వాత మరోసారి స్టార్ మా వేదికపై బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ ఉత్సవ పేరిట మరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లవి ప్రశాంత్ ను రాజకీయాలలోకి వెళ్ళమంటూ శివాజీ సలహా ఇచ్చారని తెలుస్తోంది.

షూటింగ్ గ్యాప్ లో పల్లవి ప్రశాంత్.. గౌతమ్.. శివాజీ ఫన్నీగా ఆఫ్ ది రికార్డ్ లో మాట్లాడుకున్న మాటలు వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ను ఉద్దేశిస్తూ శివాజీ మాట్లాడుతూ.. ఏం రా ప్రశాంత్.. నువ్వు పెద్ద ఎమ్మెల్యే అయిపోయావురా. నిన్ను కలవడమే చాలా కష్టంగా ఉంది ఇంతకీ ఏ పార్టీలోకి వెళ్తున్నావు కాంగ్రెస్ పార్టీలోకా లేదంటే బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నావా లేదంటే నువ్వే ఒక కొత్త పార్టీ పెట్టేసేయ్ అంటూ ప్రశాంత్ వద్ద శివాజీ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ వేస్తున్నారు. బిగ్ బాస్ లో గెలిస్తేనే ఎమ్మెల్యే అయిపోతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ విన్నర్ అవ్వడానికి శివాజీ పాత్ర కూడా ఎంతో ఉందని చెప్పాలి. శివాజీ ప్రశాంత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.హౌస్ లో ఉన్నన్ని రోజులు తనని బాగా ఎంకరేజ్ చేయడంతోనే తాను ఈ విజయం అందుకున్నాను అంటూ ప్రశాంత్ కూడా పలు సందర్భాలలో తెలిపారు.

Read More: నడుముకు బెల్టు.. ఊత కర్రలతో వీల్ చైర్ కి అంకితమైన హీరో.. ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్?

ట్రెండింగ్ వార్తలు