BiggBoss Telugu 7: సైకోలుగా మారిన అభిమానులు..షోను ర‌ద్ధు చేయాల‌ని సిటిజ‌న్స్ డిమాండ్‌

December 18, 2023

BiggBoss Telugu 7: సైకోలుగా మారిన అభిమానులు..షోను ర‌ద్ధు చేయాల‌ని సిటిజ‌న్స్ డిమాండ్‌

ఇప్ప‌టికే బిగ్‌బాస్ సీజ‌న్ 7 లో(BiggBoss Telugu 7) కంటెస్టంట్లు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు…అది స‌రిపోద‌ని చివ‌రిరోజు వాళ్ల అభిమానులు అంత‌కు మించి ర‌చ్చ చేశారు. ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గర ప‌ర‌స్ప‌ర వాగ్వాదాలు, వాళ్ల‌ హంగామా చూస్తే అసలు ఈ బిగ్‌బాస్ షో ర‌ద్ధు చేస్తే బెట‌ర్ అనే ఆలోచ‌న రాక‌పోదు.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద రచ్చ రచ్చ చేశారు పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth), అమర్‌దీప్‌(Amardeep) అభిమానులు. రెండు వర్గాలుగా విడిపోయి వీళ్లంతా వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి అది కొట్లాటవరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే కొందరు ఆర్టీసీ బస్సుతో పాటు మరికొన్ని వాహనాలపైనా దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కి చేరుకుని లాఠీచార్జ్‌ చేసి అభిమానులను చెదరగొట్టారు.

బిగ్‌బాస్‌ సీజన్‌-7(BiggBoss Telugu 7) టైటిల్‌ను యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ దక్కించుకున్నాడు. రన్నరప్‌గా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ నిలిచాడు. ఈ సందర్భంగా ‘బిగ్‌బాస్‌’ షూటింగ్‌ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు అభిమానులు. ఈ క్రమంలో రెండు వర్గాల అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అటుగా వెళ్తున్న కొండాపూర్‌-సికింద్రాబాద్‌ ఆర్టీసీ బస్సుపైనా దాడి చేసి, అద్దాన్ని పగలగొట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ కారుపై దాడి జరిగింది. కారులో ఉన్న అమర్ దీప్‌ని అతని భార్యని బూతులు తిడుతూ సైకోలుగా బిహేవ్ చేశారు. అమర్ దీప్‌ను కారు నుంచి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒకడైతే ఏకంగా కారు పైకి ఎక్కేశాడు. దీంతో కారులో ఉన్న అమర్‌ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారని తెలుస్తోంది. హౌస్‌లో ఉన్న సమయంలో అమర్‌దీప్‌, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే ఈ ఉద్రిక్తతలకు కారణం అని తెలుస్తోంది. టైటిల్‌ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ రాత్రి 10 గంటల వరకూ కనిపిస్తే.. ఆ తర్వాత అర్థరాత్రి వరకూ ఫ్యాన్స్‌ కొట్లాట ఉద్రిక్తతలకు దారి తీసింది. గొడవకు సంబంధించిన విజువల్స్ సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇరువురి అభిమానుల చర్యలపై పలవురు సిటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మండిపడుతున్నారు. అసలు ఎమోషన్స్ రెచ్చగొట్టే బిగ్ బాస్ షోనే రద్దు చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

Read More: Salaar: ప్ర‌భాస్‌ని డార్లింగ్ అని ఎందుకంటారో అప్పుడు అర్ధ‌మైంది – పృథ్వీరాజ్‌

ట్రెండింగ్ వార్తలు