డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

January 30, 2024

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఇండస్ట్రీలో మారు మోగుతున్నటువంటి పేరు. దీనమ్మ జీవితం అని ఒక షార్ట్ ఫిలిం ద్వారా ఈయన అందరి దృష్టిని ఆకర్షించారు. ఇలా పలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి ఈయన రచయితగా పలు సినిమా కథలను కూడా రాశారు అదేవిధంగా ఎన్నో ఎండార్స్మెంట్ షూట్ చేస్తూ తనలో ఉన్నటువంటి ప్రతిభను బయటపెట్టారు. ఇలా ఎప్పటికప్పుడు తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఈయనకు డైరెక్టర్ గా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

ఇలా డైరెక్టర్ గా ఇదివరకు ఈయన చేసినటువంటి జాంబిరెడ్డి సినిమా కూడా మంచి సక్సెస్ అయింది. తాజాగా ప్రశాంత్ వర్మ తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ప్రశాంత్ వర్మ వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

ప్రశాంత్ ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో నారాయణ రాజు, కనకదుర్గ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి నారాయణ సివిల్ కాంట్రాక్టర్ కాగా తల్లి కనకదుర్గ గవర్నమెంట్ టీచర్. ఇక చిన్నప్పటినుంచి సినిమాలపై ఆసక్తి ఉన్నటువంటి ప్రశాంత్ వర్మ ఇండస్ట్రీలోకి వచ్చారు అయితే ఈయన ఇప్పటికీ సింగిల్ అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ ఈయనకు పెళ్లి జరిగిందనే విషయం చాలామందికి తెలియదు.

ప్రశాంత్ వర్మ ఆంధ్ర ప్రదేశ్ కి చెందినటువంటి సుకన్య అనే అమ్మాయిని 2020 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఈమె చూడటానికి ఎంతో అందంగా హీరోయిన్లను మించి ఉన్నారని చెప్పాలి. ఇక సుకన్య సచ్ బై సుకన్య రాజు చేకూరి అనే ఒక బ్రాండ్ ని కలిగి ఇండో వెస్టర్న్ బ్రాండ్స్ కి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఉంటుంది.ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ గా సుకన్య రాజు టాప్ లో ఉన్నారు. ఇక ఈమె గురించి ఈ విషయాలు తెలిసి అందరూ కూడా షాక్ అవుతున్నారు.

Read More: అల్లు అర్జున్ కి పోటీగా నాని?

ట్రెండింగ్ వార్తలు