‘జిల్లా’ ‘తుపాకి’ ‘అదిరింది’ ‘సర్కార్’ ‘విజిల్’ ‘మాస్టర్’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్.ఆయన నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. ఏప్రిల్ 13 న విడుదలైన ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా యోగిబాబు, సెల్వ రాఘవన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.’డాక్టర్’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ‘సన్ పిక్చర్స్’ బ్యానర్ పై కళానిధిమారన్ నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లను రాబట్టింది. రెండవ రోజున కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపించింది . ఒకసారి బీస్ట్ 2 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం : 2.2 కోట్లు
సీడెడ్ : 0.90 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.72 కోట్లు
ఈస్ట్ : 0.45 కోట్లు
వెస్ట్ : 0.37 కోట్లు
కృష్ణా : 0.48 కోట్లు
గుంటూరు : 0.45 కోట్లు
నెల్లూరు : 0.31 కోట్లు
——————————————————–
ఏపి + తెలంగాణ : 5.88 కోట్లు(షేర్)
‘బీస్ట్’ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ను గమనిస్తే :
నైజాం: 3.3 కోట్లు సీడెడ్ : 2 కోట్లు ఉత్తరాంధ్ర : 1.8 కోట్లు ఈస్ట్ : 0.75 కోట్లు వెస్ట్ : 0.70 కోట్లు కృష్ణా : 0.80 కోట్లు గుంటూరు : 0.88 కోట్లు నెల్లూరు : 0.45 కోట్లు ——————————————————– ఏపి + తెలంగాణ : 10.68 కోట్లు
‘బీస్ట్’ చిత్రం తెలుగులో హిట్ అనిపించుకోవడానికి రూ.10.68 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులకి ఈ చిత్రం రూ.5.88 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.4.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.లాంగ్ వీకెండ్ వల్ల ఈ మూవీకి కలిసొచ్చే అవకాశం ఉంది.
Read More:
Vijay Beast: ‘బీస్ట్’ డే1 కలెక్షన్స్ .!