Beast: మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విజ‌య్ సెటైర్లు

April 13, 2022

Beast: మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విజ‌య్ సెటైర్లు

తమిళ స్టార్ హీరో విజయ్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారో లేదో తెలీదు కాని ఆయన సినిమాల్లో రాజకీయాల ప్రస్తావన మాత్రం ఖ‌చ్చితంగా ఉంటుంది. ప్రభుత్వాలపై సెటైర్లు ఉంటాయి. గతంలో ‘అదిరిందిస సినిమాలో ‘జీఎస్టీ’ మీద వేసిన సెటైర్లు అప్ప‌ట్లో దుమారం రేపాయి. విజయ్ కావాలని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మీద సెటైర్లు వేశారనే మాటలు వినిపించాయి. తాజాగా ఈ రోజు విడుద‌లైన బీస్ట్(Beast) సినిమాలో కూడా ప‌తాక స‌న్నివేశాల్లో విజయ్ డైలాగులు వింటే…మోడీ ప్రభుత్వంపై సెటైర్లు వేసినట్టు ఉన్నాయనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతోంది.

ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం గురించి ..నటుడిగా మీరు ప్రయాణం ప్రారంభించిన తొలినాళ్లలో ఇలయ దళపతి అన్నాడు. ఆ తర్వాత దళపతి అన్నారు. మరి, తలైవన్ అయ్యే అవకాశం ఉందా?’ అని నెల్సన్ అడిగారు. ”ఆ బిరుదులు అభిమానులు ఇచ్చారు. పరిస్థితులు డిమాండ్ చేశాయి. నాయకుడు అనేది కూడా పరిస్థితులు, అభిమానుల అంచనాలపై ఆధారపడి ఉంటుంది” అని విజయ్ చెప్పారు.

ఇది కూడా చ‌ద‌వండి: Beast Movie Review: విజ‌య్ బీస్ట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌

ట్రెండింగ్ వార్తలు