రజనీకాంత్‌ చార్జ్‌ తీసుకునేది ఎప్పుడంటే..!

August 8, 2022

రజనీకాంత్‌ చార్జ్‌ తీసుకునేది ఎప్పుడంటే..!

రజనీకాంత్‌(RajiniKanth) హీరోగా నటించిన విడుదలైన లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘అన్నాత్తే’(Annatthe) (తెలుగులో ‘పెద్దన్న’) బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తర్వాతి చిత్రాన్ని తమిళంలో ‘డాక్టరు’, ‘కోలమావుకోకిల’ వంటి సినిమాలను తీసిన నెల్సన్‌ దిలీప్‌కుమార్‌(Nelson Dilip Kumar)తో చేయడానికి రెడీ అయ్యారు రజనీకాంత్‌. కానీ నెల్సన్‌ దిలీప్‌కుమార్, విజయ్‌ కాంబి నేషన్‌లో లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘బీస్ట్‌’(Beast) డిజాస్టర్‌గా నిలిచింది.

దీంతో రజనీకాంత్‌ డైలమాలో పడ్డారు. కానీ నెల్సన్ పై నమ్మకం ఉంచి సినిమా చేయడానికి ముందడుగు వేశారు. ఇటు నెల్సన్‌ కూడా రజనీకాంత్‌ సినిమా కాబట్టి స్క్రిప్ట్‌పై మరింత వర్క్‌ చేశారు. ఇక సన్‌పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘జైలర్‌’(Jailor) అనే టైటిల్‌ పెట్టారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్‌ సిటీలో ప్రారంభం కానున్నట్లుగా తెలిసింది. కానీ ఈ నెల 22 నుంచి రజనీకాంత్‌ సెట్స్‌లో జాయిన్‌ అవుతారట.

మరోవైపు ఈ చిత్రంలో ఐశ్యర్యారాయ్‌(Ishwarya Rai) హీరోయిన్‌గా, యంగ్‌ హీరోయిన్‌ మాళవిక మోహనన్, సీనియర్‌ యాక్ట్రస్‌ రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More: Ghost Movie: నాగార్జున ‘ఘోస్ట్‌’ కంప్లీట్‌

ట్రెండింగ్ వార్తలు