August 29, 2022
‘బాహుబలి’ సిరీస్‌లో అమరేంద్రబాహుబలిగా ప్రభాస్, కట్టప్పగా సత్యరాజ్ అదరగొట్టారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలను ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ కాంబినేషన్ మళ్లీ ఇప్పుడు రిపీట్ కానున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ అనే సినిమా రూపుదిద్దుకోంటుంది. ‘రాజా డీలక్స్’ అనే థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఈ సినిమా తాతమనవళ్ల కథ అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు తాతగా సత్యరాజ్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే బాహుబలి కాంబినేసన్ రిపీట్ అయినట్లే.
మారుతి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు ‘ప్రతిరోజూ పండగే’, ‘పక్కా కమర్షియల్’ చిత్రాల్లో సత్యరాజ్ లీడ్ రోల్స్ చేశారు. సో..మారుతి ‘రాజా డీలక్స్’ చిత్రంలోనూ సత్యరాజ్ పాత్ర ఉంటుందనేది ఫిల్మ్‌నగర్ టాక్. మరో వైపు బాహుబలి తర్వాత సత్యరాజ్, ప్రభాస్ ‘రాధేశ్యామ్’లో కలిసి నటించారు. కానీ రాధేశ్యామ్ తెలుగు వెర్షన్‌లో మాత్రం సత్యరాజ్ లేరు. చిత్రంలో విక్రమాదిత్య (ప్రభాస్ పాత్ర పేరు) గురువుగా కృష్ణంరాజు నటించారు. మిగ తా భాషల్లో సత్యరాజ్ నటించారు. మరి..అనుకున్నట్లు బాహుబలి కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.