ప్రభాస్ న్యూ లుక్ చూశారా.. మునుపటిలా మారిపోయిన డార్లింగ్.. లుక్ మాములుగా లేదంటూ?

April 18, 2024

ప్రభాస్ న్యూ లుక్ చూశారా.. మునుపటిలా మారిపోయిన డార్లింగ్.. లుక్ మాములుగా లేదంటూ?

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మనందరికి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రభాస్ చివరగా సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, స్పిరిట్, కల్కి, సలార్ 2 లాంటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో కల్కి సినిమా మొదటగా విడుదల కానుంది. కాగా డార్లింగ్ బాహుబలి తరువాత లుక్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ సినిమా తరువాత అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావడంతోనే ప్రభాస్ బాడీ ఫిట్‌నెస్ పై పెద్దగా దృష్టి సారించలేకపోయారు.

అయితే ఇటీవల చికిత్స చేయించుకొని ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ ఒక్కప్పటి లుక్స్ లోకి ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ప్రభాస్ బరువు తగ్గి, మిర్చి సమయంలోని లుక్స్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్ వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ వీడియోని షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మిర్చి లుక్ లో ప్రభాస్ ఫోటో ని లేటెస్ట్ ఫోటోని పక్కపక్కన పెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

కాగా ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ప్రస్తుతం కొన్ని ప్యాచ్ వర్క్స్ సంబంధించిన సీన్స్ ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు రోజుల్లో ఈ మూవీ రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ రానున్నది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ ఎలక్షన్స్ రావడంతో మూవీ పోస్టుపోన్ చేయాల్సి వచ్చింది.

Read More: 14 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్న ఆ స్టార్ హీరోలు.. ఎవరో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు