సరికొత్త లుక్ లో అదరగొడుతున్న ప్రభాస్.. ఏమున్నాడురా బాబు అంటూ?

April 24, 2024

సరికొత్త లుక్ లో అదరగొడుతున్న ప్రభాస్.. ఏమున్నాడురా బాబు అంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఉన్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ వరుసగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే కల్కి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా ఈ మూవీ ప్యాచ్ వర్క్స్ లో పాల్గొంటూ చిత్ర యూనిట్ కి సహకరిస్తూ వస్తున్నారు. ఇక ఈ మూవీ సెట్స్ లో ఉన్న ప్రభాస్ ని కొందరు అభిమానులు కలుసుకోగా డార్లింగ్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో అందర్నీ ఆకట్టుకుంటుంది.

ఆ పిక్ లో ప్రభాస్ లాంగ్ హెయిర్, బరువు తగ్గి ఒకప్పటి డార్లింగ్ ని గుర్తుకు చేస్తున్నారు. ఇక ఈ పిక్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఏమున్నాడురా బాబు అంటూ కామెంట్స్ చేస్తూ పిక్ ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజెన్స్ ఈ పిక్ చూసి.. యానిమల్ మూవీలో రణ్‌బీర్ లుక్ లా ఉంది. కొంపదీసి ఇది స్పిరిట్ కోసం చేసిన టెస్ట్ లుక్ నా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Read More: వాళ్లకి గట్స్ ఉన్నాయి కాబట్టే సినిమాను తీశారు.. తేజ సజ్జ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు