గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కువ.. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం అదిరిపోయిన ఉస్తాద్ బ్లేజ్!

March 20, 2024

గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కువ.. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం అదిరిపోయిన ఉస్తాద్ బ్లేజ్!

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా ఇప్పటికే 50% షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా బిజీగా ఉన్నారు. నేపథ్యంలో సినిమా షూటింగ్ వాయిదా పడింది అయితే ఉన్నఫలంగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ విడుదల చేశారు.

ఈ సినిమా నుంచి భగత్’ స్ బ్లేజ్ అంటూ వీడియోను రిలీజ్ చేశారు. పొలిటికల్ టచ్ తో కూడిన ఈ పవర్ ఫుల్ వీడియో లో డైలాగ్స్ బాగున్నాయి. ఇందులో ఉన్నటువంటి డైలాగ్స్ అభిమానులకు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించినటువంటి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల నటిస్తున్నారు.

ఇక ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ కిందకు పడేస్తూ చెప్పినటువంటి డైలాగ్స్ సంచలనంగా మారాయి. క్లాస్ పగిలే కొద్దీ పదునెక్కువ.. గ్లాస్ అంటే సైజు కాదు..ఇది ఒక సైన్యం అంటూ ఈయన చెప్పినటువంటి డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఇలాంటి డైలాగ్స్ ద్వారా ఈ అప్డేట్ విడుదల చేయడంతో పలువురు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ టీజర్ సినిమా ప్రమోషన్ల కోసం విడుదల చేశారా లేకపోతే రాజకీయ ప్రచార కార్యక్రమాల కోసం విడుదల చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పార్టీ గుర్తు కూడా గాజు గ్లాస్ కావడంతో ఉన్నఫలంగా ఈ సినిమా నుంచి ఈ బ్లెజ్ విడుదల చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి.

Read More: సూర్య పాన్ వరల్డ్ మూవీ ‘కంగువ’ టీజర్

ట్రెండింగ్ వార్తలు