November 30, 2021
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం భీమ్లానాయక్ పై ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కుతున్నప్పటికీ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్క్రిప్టులో ఎన్నో మార్పులు చేశారు. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మూడు పాటలు, గ్లింప్స్, ప్రోమోలు విడుదలై మంచి ఆదరణను దక్కించుకున్నాయి. అయితే నాలుగవ పాటగా `అడవితల్లి` అనే పాట రాబోతుంది. ఈ పాట ఎప్పుడు వస్తుందనేది రేపు ప్రకటించనున్నారు నిర్మాతలు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు ముందు త్రివిక్రమ్ వేరే టైటిల్ అనుకున్నారట. మాములుగా త్రివిక్రమ్ సినిమాలు అ అనే అక్షరంతో మొదలవుతాయి. ఆ క్రమంలోనే ఈ సినిమాకు ‘అసుర సంధ్య వేళలో..’. అనే టైటిల్ అనుకున్నారట. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా లేకపోవడం, మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వదేమోనని భీమ్లా నాయక్‌గా పేరు మార్చారట.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్, రానా దగ్గుబాటి జోడీగా సంయుక్తా మీనన్ నటించారు.
అడవి తల్లి మాట… #BheemlaNayak
— Naga Vamsi (@vamsi84) November 29, 2021
Update Tomorrow Morning! 🔥
Stay Tuned @SitharaEnts