దసరా సీక్వెల్ పై కీలక అప్డేట్.. షూటింగ్ ప్రారంభం అయ్యేది అప్పుడేనా?

March 27, 2024

దసరా సీక్వెల్ పై కీలక అప్డేట్.. షూటింగ్ ప్రారంభం అయ్యేది అప్పుడేనా?

ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సూపర్ హిట్ సినిమాకు తప్పకుండా సీక్వెల్ చిత్రం వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నాని హీరోగా నటించినటువంటి చిత్రాలలో దసరా సినిమా కూడా ఒకటి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడి దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా గత ఏడాది మార్చి 30 తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నాని డీ గ్లామర్ పాత్రలో నటించారు. ఇలా నాని సినీ కెరియర్లో సుమారు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినటువంటి సినిమాగా దసరా సినిమా నిలిచిందని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి డైరెక్టర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు.

తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇలా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కావడం అంటే వచ్చే ఏడాది మొదట్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సీక్వెల్ రాబోతుందని తెలిసి ఈ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం నాని సరిపోదా శనివారం వంటి సినిమాలతో పాటు మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

Read More: కొడుకు పుట్టినరోజు 500 మందికి అన్నదానం చేసిన సురేఖ?

ట్రెండింగ్ వార్తలు