March 30, 2024
తమిళ స్టార్ హీరో సూర్య ఒక సినిమాకి మరొక సినిమాకి సంబంధం లేకుండా కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా ఈ సినిమా రిలీజ్ కోసం కేవలం తమిళనాడు మాత్రమే కాకుండా ప్యాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది.
మరొకవైపు సుధా కొంగర దర్శకత్వంలో కూడా సూర్య సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. సూరారై పోట్రు,ఆకాశం నీ హద్దురా సినిమాలు తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. సూర్య 43 వర్కింగ్ టైటిల్ తో 2డీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నజ్రియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.
అయితే ఇంతలోనే సూర్య తన ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తన 44వ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ అవి. గురువారం తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి అధికారికంగా ప్రకటించారు సూర్య. తన 44వ సినిమా జిగర్ తండా, జిగర్ తండా డబుల్ ఎక్స్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో లవ్ లాఫ్టర్ వార్ చిత్రం రూపొందనుంది.
ఇదో కొత్త ప్రారంభం మీ అందరి ఆశీర్వచనం కావాలి అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు సూర్య. ఈ సినిమాని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2d ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంజ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించనుంది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు మూవీ టీం. పోస్టర్ని గమనిస్తే దట్టమైన అడవి, చుట్టూరా కార్తిచ్చు, ఒక కారు, చెట్టుపై బాణం దాని అడుగుభాగాన లవ్ లాఫ్టర్ వార్ అని రాసి ఉంది. దీంతో అనౌన్స్ పోస్టర్ తోనే ఆసక్తి రేపేలా చేశాడు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు.
Read More: నేను అలా అనలేదు… జనసేనా ప్రచార విషయంపై క్లారిటీ ఇచ్చిన అనసూయ?