ఒకే ఇంట్లో ఉన్న 18 ఏళ్లకు ఆ పని చేయబోతున్న సూర్య జ్యోతిక?

April 22, 2024

ఒకే ఇంట్లో ఉన్న 18 ఏళ్లకు ఆ పని చేయబోతున్న సూర్య జ్యోతిక?

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సినీనటి జ్యోతిక నటుడు సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరు కోలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రాలు కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.

ఇకపోతే సూర్య జ్యోతిక ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా వీరిద్దరూ ఆన్ స్క్రీన్ పై ఆఫ్ స్క్రీన్ పై కూడా లవబుల్ కపుల్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక సూర్య జ్యోతిక పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి వెండితెరపై నటించిన సందర్భాలు లేవు. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు పూర్తిగా దూరంగానే ఉన్నారని చెప్పాలి కానీ ఇటీవల ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే గత ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సూర్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. అయితే ఆ తరుణం రానే వచ్చిందని తెలుస్తోంది. సూర్య జ్యోతిక కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతుందని సమాచారం. బెంగళూరు డేస్ ఫెమ్ అంజలి మేనన్ దర్శకత్వంలో సూర్య జ్యోతిక ప్రధాన పాత్రలలో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది .ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.

ఇలా సూర్య జ్యోతిక 18 సంవత్సరాల తర్వాత తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు అనే విషయం తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు అధికారకంగా వెల్లడించనున్నారు. ప్రస్తుతం సూర్య కంగువా అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Read More: తలైవాతో మన్మధుడు.. అంచనాలు పెంచేస్తున్న లోకేష్?

ట్రెండింగ్ వార్తలు