ఒకరోజు మీ భర్తను నాకు ఇచ్చేయండి.. జ్యోతికను కోరిన అభిమాని.. నటి రిప్లై ఇదే?

March 22, 2024

ఒకరోజు మీ భర్తను నాకు ఇచ్చేయండి.. జ్యోతికను కోరిన అభిమాని.. నటి రిప్లై ఇదే?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో జ్యోతిక ఒకరు. ఒకానొక సమయంలో ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలను నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇటీవల సైతాన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, మాధవన్ జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించినటువంటి ఈ సినిమా విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈమె ఇటీవల తన టీంతో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటో పై ఓ అభిమాని చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ అభిమాని కామెంట్ చేస్తూ.. జ్యోతిక గారు సిల్లును ఒరు కాదల్ చిత్రంలో మాదిరి నాకు మీ భర్త సూర్యను ఒకరోజుకు ఇవ్వండి అంటూ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ చూసి షాక్ అయ్యేటటువంటి జ్యోతిక అదేం కుదరదు అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా జ్యోతిక నుంచి రిప్లై రావడంతో ఆ అభిమాని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మీరు నాకు రిప్లై ఇవ్వడమే గొప్ప విషయం అంటూ ఆ అభిమాని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక సూర్య జ్యోతిక ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రేమించి పెద్దలను ఎదిరించి వీరు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు ప్రస్తుతం వీరిద్దరు కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Read More: నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదు: మనోజ్

ట్రెండింగ్ వార్తలు