మెగా కోడలు లావణ్య కు అలాంటి జబ్బు ఉందా.. అందుకే పెళ్లిలో ఆ పని చేయలేదా?

March 27, 2024

మెగా కోడలు లావణ్య కు అలాంటి జబ్బు ఉందా.. అందుకే పెళ్లిలో ఆ పని చేయలేదా?

స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ తెలుగు హీరోయిన్గా ఫేమస్ అయ్యారు. అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి లావణ్య అనంతరం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఈమె సినిమాలలో నటిస్తున్న సమయంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడినటువంటి లావణ్య పెద్దల సమక్షంలో వీరి వివాహాన్ని గత ఏడాది నవంబర్ 1వ తేదీ ఇటలీలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా లావణ్యకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లావణ్య త్రిపాటికి ఒక జబ్బు ఉందంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.

లావణ్య త్రిపాటికి కలర్స్ అంటే అలర్జీ ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా వాటర్ కలర్స్ అంటే ఈమెకు ఏమాత్రం సరిపోదట. ఈ విధంగా వాటర్ కలర్ కనుక తనపై చల్లితే మాత్రం స్కిన్ మొత్తం రెడ్ రాషెస్ వస్తాయని తెలుస్తుంది ఇలా కలర్ అలర్జీతో బాధపడుతున్నటువంటి ఈమె తన పెళ్లిలో కూడా హల్ది సమయంలో ఎలాంటి కలర్స్ ఉపయోగించకుండా కేవలం ట్రెడిషనల్ పద్ధతిలో పసుపు నీళ్లను మాత్రమే చల్లుకున్న సంగతి తెలిసిందే.

ఇక పెళ్లి తర్వాత మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టినటువంటి లావణ్య త్రిపాఠి సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. ఇటీవల ఈమె నటించిన మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈమె పలు సినిమాలకు కూడా కమిట్ అయ్యానని ఈ సిరీస్ ప్రమోషన్లలో వెల్లడించారు. ఇక పెళ్లి తర్వాత సినిమాల పరంగా తనకు ఎలాంటి ఆంక్షలు లేవని ఈమె తెలియజేశారు.

Read More: మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమా మంజుమ్మల్ బాయ్స్.. తెలుగులో కూడా వచ్చేస్తుంది!

ట్రెండింగ్ వార్తలు