గామి ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే!

March 1, 2024

గామి ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే!

గత కొన్ని సంవత్సరాలుగా గామి సినిమా గురించిన చర్చ జరుగుతుంది. 8 సంవత్సరాలపాటు కథతో ప్రయాణం, నాలుగు సంవత్సరాలు పాటు షూటింగ్ జరుపుకొని చివరికి మార్చి 8 థియేటర్లలో విడుదల కాబోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో అఘోరగా విశ్వక్ సేన్ ఎలా చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన వాళ్ళకి సినిమా మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కడా ఏ పాయింట్ ని కూడా ట్రైలర్ లో దాచిపెట్టలేదు.

వారి టేకింగ్ కథ చెప్పిన విధానం మీద నమ్మకంతో ఈ విధంగా ట్రైలర్ ని చూపించి ఉండవచ్చు.కాగిత విద్యాధర్ ఈ స్టోరీ మీద ఇన్నేళ్లుగా ఎందుకు ఉన్నాడో,విశ్వక్ సేన్ నాలుగేళ్లు సమయం తీసుకున్నా కూడా ఈ మూవీ ని ఎందుకు చేశాడు అనే క్లారిటీ ఈ ట్రైలర్ చూస్తే వచ్చేస్తుంది. అఘోరగా నటించిన విశ్వక్ సేన్ ఒక మనిషిని తాకితే అతని శరీరం నీలంగా మారిపోతుంది. ఆ సమస్య పరిష్కారం కోసమే విశ్వక్ తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు.

ప్రమాదకరమైన హిమాలయాలకు బయలుదేరుతాడు. 36 సంవత్సరాలకు ఒకసారి దొరికే మాలి పత్రాలతో తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలుసుకుంటాడు. ఈ ప్రయాణంలో అతనికి తోడుగా చాందిని చౌదరి ఉంటుంది. మరోవైపు ఒక గ్రామంలో దేవదాసి వ్యవస్థ ఉంటుంది.ఇంకొక దగ్గర ల్యాబ్ లో మనుషుల మీద వింత ప్రయోగాలు చేస్తూ ఉంటారు

అయితే కనెక్షన్ లేని ఈ పాయింట్లు ను విశ్వక్ సేన్ కనెక్ట్ చేస్తాడు అనిపిస్తుంది. ప్రతి సీన్, ప్రతి షార్ట్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. గ్రాఫిక్స్ కూడా చాలా న్యాచురల్ గా కనిపించాయి. డీటెయిలింగ్ మీద డైరెక్టర్ తీసుకున్న శ్రద్ధ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే మార్చ్ 8 వరకు వెయిట్ చేయాల్సిందే.

Read More: నా మాటలకు బాధపడి ఉంటే క్షమించండి.. వెనక్కు తగ్గిన నాగబాబు!

ట్రెండింగ్ వార్తలు