Gaami Movie Twitter Review: నేషనల్ అవార్డు పక్కా?

March 8, 2024

Gaami Movie Twitter Review: నేషనల్ అవార్డు పక్కా?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తాజా చిత్రం గామి. ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా తన టాలెంట్ తో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఎంతో విభిన్నమైనటువంటి కథ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి విశ్వక్ గామి ద్వారా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా నేడు విడుదలైనటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించింది ఏంటి అనే విషయాలు ప్రస్తుతం ట్విట్టర్ ద్వారా అభిమానులు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. డైరెక్టర్ విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సరసన చాందిని చౌదరి నటించారు. ఇక ఇందులో ఈయన అఘోరగా నటించిన సంగతి మనకు తెలిసిందే. మరి ఇలాంటి ఒక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారా అసలు ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి అనే విషయానికి వస్తే..

ఈ సినిమా గురించి ఒక నెటిజన్ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇదొక విజువల్ వండర్ సినిమా అని తెలిపారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఆసక్తికరంగా ఉందని ఈయన వెల్లడించారు. ఈ విలువైనటువంటి స్టోరీని ఒక సినిమాగా చేయడం కోసం డైరెక్టర్ చాలా కష్టపడి ఉంటారని ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని వారి అభిప్రాయాలను తెలియజేశారు ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడం కూడా పక్కా అంటూ ప్రేక్షకులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సినిమాలో అఘోరగా విశ్వక్ ప్రేక్షకులను మెప్పించారని అభిమానులు చెప్పకనే చెప్పేస్తున్నారు.

Read More: అల్లు అర్జున్ తన లవ్ స్టోరీని ముందుగా ఆ హీరోయిన్ కి చెప్పారా.. ఎందుకంటే?

ట్రెండింగ్ వార్తలు