లైగర్‌ ఫెయిల్యూర్‌ గురించి చార్మి ఏమన్నారంటే..!

August 30, 2022

లైగర్‌ ఫెయిల్యూర్‌ గురించి చార్మి ఏమన్నారంటే..!

విజయ్‌ దేవరకొండ హీరోగా ఆగస్టు 25, 2022న విడుదలైన ‘లైగర్‌’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. పూరీ జగన్నాథ్, చార్మి ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలవడం పట్ల చార్మి స్పందించారు. ‘‘2019లో మేం కరణ్‌జోహర్‌ను కలిశాం. 2020 జనవరిలో లైగర్‌ తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ మొదలైంది. ఆ తర్వాత కరోనా ఫస్ట్‌ వేవ్, సెకండ్‌ వేవ్, థర్డ్ వేవ్‌ సిట్చువేషన్స్, థియేటర్స్‌లో 50శాతం ఆక్యూపెన్సీ, టికెట్‌ ధరలు, కరోనా పరిస్థితుల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌’, ‘పుష్ప: ది రైజ్‌’ వంటి భారీ చిత్రాల విడుదల, ఇలా అన్నీ సమస్యలను తట్టుకున్నాం. ఇదే సమయంలో ఆడియన్స్‌ అభిరుచులు కూడా మారాయి. కానీ మా సినిమా షూటింగ్‌ ఆల్రెడీ మొదలైపోయింది. అయినప్పటికీని ‘లైగర్‌’ సినిమా ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందనే అనుకున్నాం. కానీ ‘లైగర్‌’ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో విఫలమైంది. చాలా కుంగుబాటుకు లోనైయ్యాం. కానీ మేం ఇంకా పోరాడతాం. మంచి సినిమాలను తీస్తాం’’ అని ఓ ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడారు చార్మి.

ఇక ‘లైగర్‌’ సినిమా తర్వాత విజయ్‌దేవరకొండతోనే పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలోనే‘జేజీఎమ్‌’ (జనగణమన) అనే సినిమా స్టార్ట్‌ అయ్యింది. ఈ సినిమాకు పూరీ, చార్మియే నిర్మాతలు. వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్‌ డేట్ ఫిక్స్‌ చేశారు. అయితే ‘లైగర్‌’ ఫలితాల దృష్ట్యా ‘జేబీఎమ్‌’ సినిమా మళ్లీ తిరిగి ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందో అన్న సందేహాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. అసలు..ఈ సినిమా ఉంటుందా? అని అనుమానాలు వ్యక్తం చేసిన వారు లేకపోలేదు.

ట్రెండింగ్ వార్తలు