September 10, 2022
సినీ పరిశ్రమలో జయాపజయాలు సర్వసాధారణం. ఒక సినిమా విజయవంతం అయింది అంటే ఎంతో మంది భవిష్యత్తు మారిపోతుంది. అలాగే ఒక సినిమా పరాజయం కూడా ఎంతో మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. ఇప్పటికే అలాంటి ఎదురుదెబ్బలు ఎన్నోతిన్న దర్శకుడు పూరిజగన్నాధ్ భవిష్యత్ మరోసారి ప్రశ్నార్ధకంగా పడిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఈ విషయం మీద విశ్లేషణ అవసరం. ఒక్క ఫ్లాప్ సినిమా తీసినంత మాత్రానా పూరిలాంటి పెద్ద డైరెక్టర్ భవిష్యత్ ప్రశ్నార్ధకం అవుతుందా? చాలా మంది పూరి అభిమానుల్ని తొలుస్తున్న ప్రశ్న ఇది. నిజానికి కాదు…పూరి మాత్రమే ఒక సినిమా అపజయం ఏ దర్శకుడి భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేయలేదు..పూరిలాంటి దర్శకుడిని అసలే చేయలేదు….
అయితే అప్పుల బాధ తట్టుకోలేక పూరి ముంబై ఇంటిని ఖాళీ చేయాల్సివస్తుంది అని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేకపోలేదు. నిజానికి పూరి ముంబైలో అసలు ఇంటిని కొనుగోలు చేయలేదు..దాదాపు 10 లక్షలకు పైగా అద్దె చెల్లించి గత మూడు సంవత్సరాలుగా ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నాడు. అదీ కాకుండా లైగర్ సినిమా మీద కాన్ఫిడెంట్‌తో చాలా ఏరియాల్లో ఓన్రిలీజ్ చేశారు. సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయే సరికి పూరి జగన్నాథ్ భవిష్యత్తుపై అనేక నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన బయ్యర్ల విషయం కూడా ఇప్పటికీ తేలడం లేదు వారికి ఎలాగోలా సగం డబ్బులు నాయనా కూడా వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ సమావేశం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే తన తదుపరి ప్రాజెక్ట్ కు వచ్చే లాభాలు కూడా లైగర్ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ తన ఆరు కోట్ల రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాడు దాంతో జనగణమన ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశమే లేదు.. దాంతో ఈ పరిస్థితులు అన్నీ సర్ధుమనిగే వరకు హైదరాబాద్‌లోనే ఉండాలనుకుంటున్నాడు. అనవసర ఖర్చు కాబట్టి ముంబై ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తున్నాడు.అంతే కాకుండా తన ఖరీదైన కారుని కూడా అమ్మేయోచనలో ఉన్నాడట పూరి.