వరుణ్ ఫ్లాప్ మూవీ అంటే చిరంజీవికి అంత ఇష్టమా.. వైరల్ అవుతున్న చిరు కామెంట్స్!

February 26, 2024

వరుణ్ ఫ్లాప్ మూవీ అంటే చిరంజీవికి అంత ఇష్టమా.. వైరల్ అవుతున్న చిరు కామెంట్స్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గత రాత్రి ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత మొదటిసారి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇలా మొదటిసారి ఈయన ఈవెంట్లో పాల్గొనడంతో చిరంజీవి గారి ఏవీ అద్భుతంగా డిజైన్ చేసారు. ఏవి పూర్తి కాగానే ఆడిటోరియం మొత్తం చిరంజీవి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ నేను యుఎస్ లో ఉన్నప్పుడు వరుణ్ ఈ సినిమా ఈవెంట్ కి రావాలి అంటూ నాకు మెసేజ్ చేశారు. ఇక నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఈ సినిమా గురించి చెప్పారు వెంటనే నేను ఈ సినిమా ఈవెంట్ కి వస్తానని తనకు చెప్పాను. ఇక ఈ సినిమా డైరెక్టర్ గురించి తెలుసుకొని నేను ఆశ్చర్యపోయానని ఈ సినిమా చేయడం కోసం ఈయన ఎంతోమంది ఆర్మీ ఆఫీసర్లను కలిసి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని సినిమా చేశారని డైరెక్టర్ పై ప్రశంసలు కురిపించారు.

తక్కువ బడ్జెట్ తో ఎంతో అద్భుతమైన క్వాలిటీ చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారని తెలిపారు. ఇక మా కుటుంబంలో వరుణ్ కి వచ్చినంత విభిన్న కథా చిత్రాలు మరెవరికి రాలేదని తెలిపారు. కంచె సినిమా ద్వారా ఒక సైనికుడుగా అంతరిక్షం సినిమా ద్వారా ఒక వ్యోమిగామిగా, తొలిప్రేమ సినిమా ద్వారా ఒక ప్రేమికుడిగా ఇలా విభిన్న కథా చిత్రాలలో నటిస్తున్నారు అయితే ఆయన చేసిన సినిమాలలో నాకు గద్దల కొండ గణేష్ సినిమా అంటే చాలా ఇష్టం అంటూ చిరంజీవి తెలిపారు. ఇలా చిరంజీవికి ఈ సినిమా ఇష్టం అనే విషయం తెలియడంతో ఒక ఫ్లాప్ మూవీ చిరంజీవికి అంతగా నచ్చిందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read More: అమ్మ అని పిలిపించుకోవాలని ఉంది.. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను శోభిత షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు