చెర్రీ, జాన్వీ కలిసి నటిస్తే చూడాలని ఉందన్న చిరంజీవి.. అదే నా కల అంటూ?

April 13, 2024

చెర్రీ, జాన్వీ కలిసి నటిస్తే చూడాలని ఉందన్న చిరంజీవి.. అదే నా కల అంటూ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల్లో మాత్రమే కాకుండా తరచూ ఏదోక విషయంతో వార్తలు నిలుస్తూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో ఏదో ఒక విషయంతో చిరంజీవి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో సక్సెస్ మీట్లలో ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొంటున్నారు.

అందులో భాగంగానే ఇటీవల ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా తాజాగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పాల్గొన్నారు చిరంజీవి. ఈ సందర్భంగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఇటీవల జాన్వీ కపూర్ ని కలిశాను. ఆమెను చూసిన వెంటనే శ్రీదేవి గుర్తుకు వచ్చింది. భావోద్వేగానికి గురయ్యాను. శ్రీదేవి మరణంతో చిత్ర పరిశ్రమ మంచి నటిని కోల్పోయింది.

రామ్ చరణ్- జాన్వీ కపూర్ జగదేకవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 చేస్తే చూడాలని ఉంది. అది నా కోరిక అని అన్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీలో శ్రీదేవి చిరంజీవి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి పిల్లలు అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోయిన్ జాన్వీ కపూర్ లు నటిస్తే చూడాలని ఉంది అని చెప్పుకొచ్చారు మెగాస్టార్.

https://telugu.chitraseema.org/tollywood-actress-focused-pawan-kalyan/

ట్రెండింగ్ వార్తలు