తేజా సజ్జాపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి.. నటుడిగా నిరూపించాడు అంటూ?

April 13, 2024

తేజా సజ్జాపై ప్రశంసలు కురిపించిన చిరంజీవి.. నటుడిగా నిరూపించాడు అంటూ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మనందరికీ తెలిసిందే. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం చిరు విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇకపోతే ఇటీవల సౌత్ ఇండియా ఫెస్టివల్ 2024లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో రాజీవ్ మసంద్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు చిరు. ఈ సందర్బంగా చిరు మాట్లాడుతూ… యంగ్ హీరో తేజా సజ్జాపై ప్రశంసలు కురిపించారు.

మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాలో నటిస్తారని రాజీవ్ మసంద్ అడగగా.. ఆ ప్రశ్నపై చిరు స్పందిస్తూ.. అక్కడ కూర్చున్న తేజ సజ్జాను చూపిస్తూ? ఆ కుర్రాడిని చూశారా ? అతడు హనుమాన్ సినిమాను చేశాడు. కానీ 25 ఏళ్ల కిందట బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించాడు. నాతో సినిమాలు చేశాడు. ఇంద్ర సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఎంతో ఎదిగాడు. అప్పటికీ అతడికి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. కానీ చిన్నప్పటి నుంచి నన్ను అభిమానించి చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ వాటిని స్పూర్తిగా తీసుకొని ఇప్పుడు హీరోగా మారి హనుమాన్ సినిమాలో నటించి నిరూపించాడు. హనుమాన్ పై సినిమా చేయాలని చాలా కాలం క్రితమే అనుకున్నాను. కానీ చేయలేకపోయాను. అతడు చేసేసాడు. నా ప్రయత్నానికి ముందే నేను సంతృప్తి చెందాను. అతడు కూడా నా ప్రయాణంలో ఒక భాగమే.. నటుడిగా నిరూపించాడు..సినీ పరిశ్రమలోని అందరితో ప్రశంసలు అందుకున్నాడు అంటూ తేజా సజ్జాపై ప్రశంసల వర్షం కురిపించారు మెగాస్టార్.

https://telugu.chitraseema.org/jakkanna-is-busy-with-dances-and-ads-ssmb29-progress-%e0%b0%92%e0%b0%95%e0%b0%b5%e0%b1%88%e0%b0%aa%e0%b1%81-%e0%b0%a1%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae/

ట్రెండింగ్ వార్తలు