April 3, 2024
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో ఫ్యామిలీగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో మెగా ఫ్యామిలీ ఒకటి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించారు. అయితే మెగా హీరోలు అందరూ కూడా తరచూ ఒకే చోట కలిసి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటారు. అది పార్టీలైనా లేదంటే ఏదైనా పండుగలు అయినా సరే మెగా ఫ్యామిలీ అంతా ఓకే చోటే ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా బెంగళూరులో ఈ ఫ్యామిలీ మొత్తం మూడు రోజులపాటు అక్కడే సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే తాజాగా విజయ్ దేవరకొండ చిరంజీవి ఇద్దరు కలిసి ఓ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ చిరంజీవిని ప్రశ్నిస్తూ ఇండస్ట్రీలోకి రాకముందు మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ నా ఫ్యామిలీ స్టార్ మా నాన్న అని తెలియజేశారు. నాన్న ఎంతో కష్టపడుతూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా కుటుంబం ముక్కలు కాకుండా అందరి మధ్య ప్రేమాను బంధాలు ఉండేలా జాగ్రత్త పడ్డారు. అలాగే నేను కూడా కుటుంబంతో కలిసి ఉంటే ఎంతో గొప్పగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి పండుగకు ఇలా అందరూ ఒకచోట కలిసేలా ఏర్పాటు చేస్తానని తెలిపారు.
ఇలా పండుగల సమయంలో అందరూ ఒకే చోట కలిస్తే కనుక వారి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి మన కుటుంబాల మధ్య బలమైనటువంటి సంబంధ బాంధ్యవ్యాలు ఏర్పడతాయి అందుకే ఇలా ప్రతి పండుగకు అందరం ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంటామంటూ చిరంజీవి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా దిగినటువంటి ఆ ఫోటో చాలా మందిని ఇన్ఫ్లుయన్స్ చేసిందని ప్రతి ఒక్కరూ ఆ ఫోటో చూసి ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలా మూడు రోజుల పాటు ఒకే చోట ఉండడం నిజంగా గ్రేట్ అంటూ చాలామంది ఆ ఫోటో పట్ల తన వద్ద మాట్లాడారని చిరంజీవి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: ఆ దేశంలో విడుదల కాబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా ఫ్యామిలీ స్టార్ రికార్డ్?