మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి నటించబోతున్న చిరంజీవి, విజయశాంతి.. ఏ సినిమాలో అంటే!

April 24, 2024

మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి నటించబోతున్న చిరంజీవి, విజయశాంతి.. ఏ సినిమాలో అంటే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి చిరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. కాగా టాలీవుడ్ లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి అలాగే మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఒకప్పుడు ఎన్నో సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

అనేక బ్లాక్‌ బస్టర్స్ వచ్చాయి. దాదాపు 20కి పైగా చిత్రాలు వచ్చాయి.కానీ ఒక టైమ్‌ తర్వాత విజయశాంతి.. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు షిఫ్ట్ అయ్యింది. దీంతో పెద్ద హీరోల సరసన సినిమాలు చేయలేదు. ఆ తర్వాత సినిమాలకే దూరమైంది విజయశాంతి. చాలా ఏళ్ల తర్వాత ఆ మధ్య సరిలేరు నీకెవ్వరు మూవీలో కీలక పాత్రలో మెరిసింది. దీంతో మళ్లీ ఆమె సినిమాలు చేస్తుందని భావించినా, అలా జరగలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ ఆమె మేకప్‌ వేసుకోబోతుందట. అది చిరంజీవి కోసమని తెలుస్తోంది. చిరంజీవితో కలిసి నటించబోతుందట.

దాదాపు 30ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు జోడీ కట్టబోతున్నట్టు తెలుస్తోంది. విశ్వంభర మూవీలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఒక ముఖ్యమైన పాత్రకి ఆమెని అడుగుతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే మెగా అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. మరి విజయశాంతి ఇందుకు ఓకే చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. వీరితోపాటు మీనాక్షి చౌదరి, సురభి వంటి భామలు ఆయనకు చెళ్లేళ్లుగా కనిపిస్తారట. నవీన్‌ చంద్ర కూడా నటిస్తున్నట్టు సమాచారం.

Read More: రౌడీ హీరో ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రాబోతోందా.. అందుకే విజయ్ ను నీల్ కలిసారా?

ట్రెండింగ్ వార్తలు