ఒక్క ఫైట్ సీన్ కోసం 26 రోజులు.. అంచనాలు పెంచుతున్న చిరంజీవి మూవీ?

April 23, 2024

ఒక్క ఫైట్ సీన్ కోసం 26 రోజులు.. అంచనాలు పెంచుతున్న చిరంజీవి మూవీ?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభరా మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఇది ఇలా ఉండే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. కాగా ఈ సినిమా కోసం 26 రోజులుగా తీస్తున్న ఒక భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రం కోసం ప్రోడక్షన్‌ డిజైనర్‌ ప్రకాశ్‌ నిర్మించిన 54 అడుగుల హనుమాన్‌ విగ్రహంతో కూడిన సెట్‌లో రామ్‌,లక్ష్మణ్‌ మాస్టర్స్‌ పర్యవేక్షణలో ఒక ఫైట్‌ని చిత్రీకరించాము.

చిరంజీవి, ఫైటర్స్‌ మధ్య ఉత్కంఠభరితంగా సాగే ఈ ఫైట్‌ ఇంటర్వెల్‌ లో వస్తుంది. ఒక్క ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం చిరంజీవి 26 రోజులు కేటాయించడం ఇదే మొదటి సారి. ఈ హై ఓల్టేజ్‌ యునిక్‌ యాక్షన్‌ బ్లాక్‌ అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుంది అని అన్నారు. కాగా 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విశ్వంభర విడుదల కానుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

Read More: సీరియస్ గా ఎఫైర్ నడుపుతున్న అనసూయ.. ఎవరితోనో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ట్రెండింగ్ వార్తలు