200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో `విశ్వంభ‌ర‌`..ఒత్తిడిలో రిస్క్ చేస్తున్న మెగాస్టార్?

October 26, 2023

200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో `విశ్వంభ‌ర‌`..ఒత్తిడిలో రిస్క్ చేస్తున్న మెగాస్టార్?

చిరంజీవి-బాలయ్యల మధ్య సినిమాల పోరు ఈ నాటిది కాదు. మూడున్నర దశాబ్ధాలుగా ఈ ఇద్దరు త‌మ సినిమాల‌తో త‌లపడుతూనే ఉన్నాయి. ఈ ప్రస్థానంలో ఇద్దరికీ బ్లాక్ బస్టర్లున్నాయి. ఇద్దరికీ కొన్ని డిజాస్టర్లూ ఉన్నాయి. అయితే ఆరోగ్యకరమైన పోటీ మాత్రం కొన‌సాగుతూనే ఉంది.

ఈ పోరులో ప్రస్తుతం బాలయ్య ముందంజలో ఉండ‌గా.. చిరంజీవి ఒత్తిడిలో ఉన్నారనేది మాత్రం వాస్తవం. వరుసగా వెక్కిరిస్తున్న ఫ్లాపులు చిరంజీవిని ఇబ్బందిపెడుతున్నాయి. అంతకంటే ఇబ్బంది పెడుతున్న అంశం మరొకటి ఉంది. ఫ్లాపులు చిరంజీవికి కొత్తకాదు, ఇలా ఫ్లాపులొచ్చిన టైమ్ లో ప్రత్యర్థి హీరో బాలకృష్ణ వరుసగా హిట్స్ కొడుతుండడం చిరంజీవి ప్రెషర్ కు ప్రధాన కారణం.

గడిచిన నాలుగేళ్లుగా చూసుకుంటే, చిరంజీవి ఫ్లాపులే ఎక్కువిచ్చారు. సైరా ఫ్లాప్ అయినా తట్టుకున్నారు, ఆచార్య డిజాస్టర్ అయినా నిలదొక్కుకున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. కానీ భోళాశంకర్ డిజాస్టర్ కావ‌డంతో మ‌ళ్లీ ఆలోచ‌న‌లో ప‌డ్డారు మెగాస్టార్. అందుకే త‌న త‌దుప‌రి సినిమాకు కల్యాణ్ కృష్ణను పక్కనపెట్టి.. ఎన్నో లెక్కలు వేసుకొని మరీ వశిష్ఠకు (బింబిసార ఫేమ్) అవకాశమిచ్చారు.

200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కాబ‌ట్టి ఈ సినిమా కోసం మెగాస్టార్ ఎన్నో సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నారు. లేట్ అయినా లేటెస్ట్ గా హిట్ కొట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఈ గ్యాప్ లో బాలకృష్ణ మరో సక్సెస్ కొడితే, చిరంజీవిపై ఒత్తిడి మరింత పెరగడం ఖాయం. ఎందుకంటే, రాజకీయాలు వద్దనుకొని, సినిమాలే లోకమని ప్రకటించి మరీ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. అటు బాలయ్య మాత్రం ఓవైపు రాజకీయాలు చేస్తూనే, మరోవైపు సినిమాలతో కూడా విజయాలు అందుకుంటున్నారు. మెగా ఒత్తిడికి ఈ ఒక్క రీజన్ చాలు.

ఫాంటసీ జానర్ మెగాస్టార్ చిరంజీవికి కొత్త ఏమీ కాదు. టాలీవుడ్ ఆల్ టైమ్ సూపర్ హిట్ ఫాంటసీ సినిమాల్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కూడా ఉంటుంది. కమర్షియల్ పరంగా ఆశించిన విజయం సాధించలేదు కానీ ‘అంజి’ చిత్రానికి కూడా అభిమానులు ఉన్నారు. కొంత విరామం తర్వాత చిరంజీవి మళ్ళీ ఫాంటసీ సినిమా చేస్తున్నారు.

చిరంజీవి 156వ సినిమా కావడంతో దీనిని Mega 156 అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ‘విశ్వంభర’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకు రానా దగ్గుబాటి (Rana Daggubati)ని సంప్రదించారని టాక్. ఈ కథ, అందులో పాత్ర విన్న తర్వాత ఆయన కూడా ఓకే చెప్పారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’లో రానా నటించారు. ఇప్పుడు చిరు చిత్రంలో నటిస్తున్నారు.

ఆల్రెడీ మెగా 156 సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎంఎం కీరవాణి, చంద్రబోస్…దర్శకుడు వశిష్ఠ, చిరంజీవి మధ్య చర్చలు జరిగాయి. సెలబ్రేషన్ సాంగ్ రికార్డ్ చేస్తున్నామని వివరించారు.

Read More: ఘ‌నంగా వెంక‌టేష్ రెండో కుమార్తె నిశ్చితార్థ వేడుక..హాజ‌రైన సినీ ప్ర‌ముఖులు

ట్రెండింగ్ వార్తలు