విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న విశ్వంభర.. ప్రీ లుక్ పోస్టర్ వైరల్!

February 2, 2024

విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న విశ్వంభర.. ప్రీ లుక్ పోస్టర్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. చిరంజీవి ఇటీవల మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈయన కొంతకాలం పాటు విరామం ప్రకటించారు. మోకాలికి సర్జరీ చేయించుకోవడంతోనే చిరంజీవి విశ్రాంతి తీసుకున్నారు. అయితే అప్పటికే వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాకు కమిట్ అయ్యారు.

తాజాగా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు ఇకపోతే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు జరగబోతున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమాకు తనని తాను సిద్ధం చేసుకుంటూ పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తూ ఉన్నారు.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి తరుణంలో ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు తేదీ మాత్రం ప్రకటించలేదు కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఫ్రీ లుక్ పోస్టర్ విడుదల చేయడమే కాకుండా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు.

మెగాస్టార్ వశిష్ట కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని విడుదల తేదీని కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా అందరికంటే ముందుగానే వచ్చేయడాది సంక్రాంతి విడుదల తేదీలను ఫిక్స్ చేసుకున్నారని చెప్పాలి. ఇదే పండుగకు ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ కూడా రాబోతుందని తెలిపారు. కానీ తేదీ మాత్రం ప్రకటించలేదు.

ఇక చిరంజీవి ప్రస్తుతం ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత తన కూతురి నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. అదే విధంగా ఈయన మారుతి డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నారని సమాచారం. మొత్తానికి రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి.

Read More: అలాంటి వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ పూనమ్ కౌర్.. ప్రస్తుత పరిస్థితి ఇదే?

ట్రెండింగ్ వార్తలు