ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్.. కల్కిలో ప్రభాస్ పేరు రివీల్ చేసిన మూవీ టీమ్!

March 9, 2024

ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్.. కల్కిలో ప్రభాస్ పేరు రివీల్ చేసిన మూవీ  టీమ్!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకు వెళ్లబోతున్న ఈ సినిమా నుంచి ఒక తాజా అప్డేట్ ని రివిల్ చేసింది ఆ మూవీ టీం. హీరో పేరుని రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది.

ఈ సినిమా ఇతిహాసాల నేపథ్యం కాబట్టి దానికి తగినట్లుగానే ప్రభాస్ పేరుని “భైరవ” అని పెట్టారు. ఈ పేరుని బట్టి చూస్తే ప్రభాస్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చెప్పేయవచ్చు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ని బట్టి చూస్తే కల్కి సినిమా స్టోరీ 6000 సంవత్సరాల క్రితం ముగిసిన కధ. మళ్లీ 2898 ఏడీ లో ప్రారంభం అవుతుంది. ఇప్పటి పోరాటాలను, అప్పటి ప్రతీకారాలను ఫ్యూచరిస్టిక్ గా కాన్సెప్ట్ లో చూపించబోతున్నారు.

ఇందులో అంతా ఫ్యూచర్ టెక్నాలజీ తోనే ఉంటుంది. పైగా వరల్డ్ వైడ్ ఫాన్స్ ని కనెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ప్రభాస్, దిశా పఠానీలపై పాటని తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో పలు భాషలకు చెందిన అగ్ర నటినటులు భాగం కావడంతో సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి.

ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనే నటిస్తుండగా దిశాపఠాని, అమితాబచ్చన్, కమలహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. మూవీ మేకర్స్ హీరో పాత్ర పేరుని రివిల్ చేయడంతో పాటు కొత్త పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో చాలా కూల్ గా కూర్చుని ఉన్నారు ప్రభాస్. స్లీవ్ లెస్ ఔట్ ఫిట్ లో పిలకవేసుకుని ఉన్న ప్రభాస్ లుక్ చాలా క్రేజీగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read More  :   హీరోయిన్లు గ్లామర్ షో చేసేది అందుకేనా.. ముఖం మీద అడిగిన రీతు చౌదరి?

ట్రెండింగ్ వార్తలు