అర్ధరాత్రి రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ చిల్ అవుతున్న లేడీ సూపర్ స్టార్.. ఫోటోలు వైరల్!

April 5, 2024

అర్ధరాత్రి రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ చిల్ అవుతున్న లేడీ సూపర్ స్టార్.. ఫోటోలు వైరల్!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈమె గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, మలయాళం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం ఒక వైపు నయనతార సినిమా పనులలో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు వ్యాపారాలను చూసుకుంటున్నారు అలాగే తన ఇద్దరు కవల పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఈమె కెరియర్ పట్ల చాలా బిజీగా మారిపోయారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే నయనతార తనుకు ఏమాత్రం విరామం దొరికిన తన భర్త పిల్లలతో కలిసి సరదాగా గడుపుతూ ఉంటారు ఇలా వారి ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే తాజాగా నయనతార సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా నయనతార అర్ధరాత్రి రోడ్డుపై ఐస్ క్రీమ్ తింటూ చాలా చిల్ అవుతూ కనిపించారు అయితే ఈ వీడియోలో ఇద్దరు యువకులు ఐస్క్రీం షాపు ఎదురుగా నయనతార బోర్డ్ ఉండడంతో ఆ బోర్డు చూస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇటువైపు తిరగగానే పక్కనే నయనతార ఐస్ క్రీమ్ తింటూ ఉండడంతో ఒకసారిగా వాళ్ళు షాక్ అవుతారు.

అరే నయనతార అంటూ ఆమెతో సరదాగా మాట్లాడుతూ కనిపిస్తారు అయితే వారిద్దరు కూడా నయనతార కజిన్స్ అని తెలుస్తోంది. ఇక ఈ వీడియోని నయనతార భర్త విగ్నేష్ తీసారని కూడా తెలుస్తోంది .మొత్తానికి చాలా ఫన్నీగా నయనతార అర్ధరాత్రి రోడ్డు పక్కన ఇలా ఐస్ క్రీమ్ తింటూ సరదాగా కనిపించడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: ఉల్లిపొర లాంటి చీర కట్టి అందాలను ఆరబోస్తూ మతి పోగొడుతున్న శృతిహాసన్!

ట్రెండింగ్ వార్తలు