ఆస్తులు మళ్లీ తన పేరు పై రాయించిన నయనతార… ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?

April 1, 2024

ఆస్తులు మళ్లీ తన పేరు పై రాయించిన నయనతార… ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది?
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి నయనతార ఇప్పటికీ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇదిలా ఉండటం తాజాగా నయనతారకు సంబంధించినటువంటి ఒక వార్త వైరల్ గా మారింది.. నయనతార గత కొద్దిరోజులుగా తన భర్త విగ్నేష్ శివన్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కూడా ప్రేమించుకొని కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేసి అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి సమయంలో నయనతార తన భర్త తనకు సర్వస్వం అని భావించి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు అన్నింటినీ కూడా ఈమె తన భర్త పేరు మీదగా రాశారు. ఇలా హీరోయిన్గా నయనతార ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలోనే ఆస్తులను పోగు చేశారు అయితే వాటన్నింటినీ కూడా తన భర్త పేరు మీద రాశారు కానీ ప్రస్తుతం మాత్రం తిరిగి నయనతార తన భర్త పేరు మీద ఉన్నటువంటి తన ఆస్తులు అన్నింటిని కూడా తన పేరు మీదగా రాయించుకున్నారని సమాచారం. ఇలా నయనతార తిరిగి ఆస్తులు అన్నింటినీ కూడా తన పేరు మీద రాయించుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోవాలనుకుంటున్నారా అందుకే ఇలా చేస్తున్నారా అంటూ కామెంట్లో చేస్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పగానే నయనతార జీవితం గురించి వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ ఇద్దరు విడిపోతారని చెప్పారు. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి చూస్తుంటే వేణు స్వామి జ్యోతిష్యం నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల ఈమె తన భర్తను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. Read More: విజయ్ క్యారెక్టర్ పై మృణాల్ షాకింగ్ కామెంట్స్… అలాంటి వ్యక్తంటూ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు