గోవాలో దేవర… కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం!

March 19, 2024

గోవాలో దేవర… కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన తాజాగా కొరటాల శివ దర్శకత్వం తెరకెక్కుతూ ఉన్నటువంటి దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీని వాయిదా వేసుకున్నారు.

రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మొదటి భాగం శర వేగంగా షూటింగ్ పనులను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఏమాత్రం సమయం వృధా చేయకుండా చిత్ర బృందం వరుస షెడ్యూల్ చిత్రీకరణ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్ర బృందం గోవా వెళ్లారని తెలుస్తుంది.

ఇలా దేవర గోవాకు పయనం అవుతూ ఇటీవల ఎయిర్ పోర్ట్ లో సందడి చేయగా అందుకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటినుంచి ఈ కొత్త షెడ్యూల్ చిత్రీకరణ షూటింగ్ పనులను ప్రారంభించుకుంది దీంతో సోమవారమే చిత్ర బృందం గోవా చేరుకున్నారు.

ఈ షెడ్యూల్ చిత్రీకరణ దాదాపు పది రోజుల పాటు ఉంటుందని తెలుస్తుంది. ఈ పది రోజులపాటు ఎన్టీఆర్ గోవాలోనే ఉండబోతున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన సంగతి మనకు తెలిసిందే .అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read More: Magadheera Re Release: మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మగధీర.. ప్రేమికుడు.. ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు