దేవి శ్రీ ప్రసాద్‌ను అవమానించిన సల్మాన్‌ఖాన్‌?

July 3, 2022

దేవి శ్రీ ప్రసాద్‌ను అవమానించిన సల్మాన్‌ఖాన్‌?

మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్‌ ట్యూన్‌ దక్షిణాదిలో సూపర్‌హిట్‌. ఇదే సూపర్‌హిట్‌ ట్యూన్స్‌ను హిందీ లోనూ రిపీట్‌ చేయాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్‌. అలా సల్మాన్‌ఖాన్‌ లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘కబీ ఈద్‌ కబీ దీవాళి’కి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చాన్స్‌ దక్కించుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్‌.

గతంలో సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే: మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’లోని ‘సీటీమార్‌’, తెలుగు హిట్‌ ‘రెడీ’ సినిమా హిందీ రీమేక్‌ (సల్మాన్‌ ఖాన్‌ హీరో)లో ‘డింక్‌చకా’ ట్యూన్‌లు దేవి శ్రీ ప్రసాద్‌ ఇచ్చినవే. అవి సల్మాన్‌కు నచ్చాయి. కానీ ‘కబీ ఈద్‌ కబీ దీవాళి’ సినిమాకు మాత్రం దేవి ఇచ్చినట్యూన్స్‌ సల్మాన్‌ఖాన్‌కు నచ్చలేదట.

దీంతో వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌ను వెతికే పనిలో పడ్డారట ఈ చిత్రం డైరెక్టర్‌ డియో ఫర్హాద్‌ సామ్జీ. ఈ ఇన్సిడెంట్‌ను తెలుసుకున్నదేవి శ్రీ ప్రసాద్‌ ఫ్యాన్స్‌…ఇది దేవిని సల్మాన్‌ఖాన్‌ అవమానించడమే అని ఫీలవుతున్నారు. అయితే ఈ పూర్తి సంఘటనపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది

ట్రెండింగ్ వార్తలు