Dhanush Sir Movie: ధనుష్‌ ‘సార్‌’ రిలీజ్‌ ఎప్పుడంటే..!

August 24, 2022

Dhanush Sir Movie: ధనుష్‌ ‘సార్‌’ రిలీజ్‌ ఎప్పుడంటే..!

ధనుష్‌ హీరోగా తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘సార్‌’. ఈ సినిమాకు తమిళంలో ‘వాత్తి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘తొలిప్రేమ’, ‘రంగ్‌ దే’ వంటి సినిమాలను తీసిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా ధనుష్‌ బర్త్‌ డే రోజు ఈ సినిమా టీజర్, ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.

విద్యావ్యవస్థ, అందులోని లోపాలు, కార్పొరేట్‌ విద్యఅంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని టీజ‌ర్ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ సినిమాను డిసెంబరు 9న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. సాయికుమార్, తనికేళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

ట్రెండింగ్ వార్తలు