November 30, 2021
సాధారణంగా స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్స్తో ఎప్పుడు మీడియాలో కనిపించాలి అనుకుంటారు దర్శకులు..కాని అఖండ(AKHANDA) లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన బోయపాటి శ్రీను మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. కేవలం ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం తప్పితే మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటున్నాడు. దానికి కారణం వినయ విధేయ రామ విడుదల సమయంలో ఆ సినిమా గురించి బోలెడు కబుర్లు చెప్పాడు బోయపాటి. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఆయన మాట్లాడిన మాటలను మీమ్స్ చేసి ట్రోల్ చేశారు. ఇప్పటికీ ఆ మీమ్స్…వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే అఖండ విడుదల వరకు మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడట బోయపాటి.
నిజానికి కథా నాయకుడు..మహా నాయకుడు తర్వాత ఆ రేంజ్లో ప్రి రిలీజ్ బిజినెస్ అయిన చిత్రం అఖండనే. సినిమా మీద ఎలాగు కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి మొదటి రోజు మధ్యాహ్నం ప్రెస్మీట్ పెట్టి మరీ గతంలో తనని ట్రోల్ చేసిన వారి మీద విరుచుకుపడనున్నాడట. ఇంత వరకూ బానే ఉంది కాని ఇక్కడే ఒక లాజిక్ మిస్ అయ్యాడనిపిస్తోంది. ప్రస్తుతం థియేటర్లకు ఆడియన్స్ రావడం చాలా కష్టంగా ఉంది. దానికి తోడు ఏపీలో టికెట్ రేట్ల విషయంలో సమస్యలు…వీటికి తోడు వినయ విధేయ రామ వంటి భారీ డిజాస్టర్ తర్వాత బోయపాటి, రూలర్ వంటి ఫ్లాఫ్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న చిత్రమిది. మరి చూడాలి అందరు ఎదురు చూస్తున్న అఖండ ఫలితం ఎలా ఉండబోతుంది అనేది.