ఒకే డేట్ లాక్ చేసిన చిరంజీవి,బాల‌కృష్ణ‌,ర‌జ‌నీకాంత్‌

August 25, 2022

ఒకే డేట్ లాక్ చేసిన చిరంజీవి,బాల‌కృష్ణ‌,ర‌జ‌నీకాంత్‌

చిరంజీవి హీరోగా ‘భోళాశంకర్‌’ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళం హిట్‌ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న రిలీజ్‌ కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై అనిల్‌సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇదే తేదీన బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కూడా విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. ఈ సినిమాను హరీష్‌ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

ఇంకా ఈ సినిమా షూటింగ్‌ అయితే స్టార్ట్‌ కాలేదు. కానీ అనిల్‌రావిపూడి సినిమాను స్పీడ్‌గా పూర్తి చేయగలడు. బాలయ్య కూడా స్పీడ్‌గానే చేస్తారు. ఈ సంగతి ఇలా ఉండగానే రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ కీలక పాత్రధారి. నరసింహాచిత్రం తర్వాత రజనీకాంత్, రమ్యకృష్ణ కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమా నిర్మాణసంస్థ సన్‌పిక్చర్స్‌ ‘జైలర్‌’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయాలనుకుంటుంది. పైగా ఈ తేదీ కొత్త తమిళ సంవత్సరాది ప్రారంభం కాబట్టి ఇంకా బాగా కలిసొస్తుందని సన్‌పిక్చర్స్‌ సంస్థ ఆలోచిస్తుందట. మరి..ఒకేతేదీన తెలుగులో చిరంజీవి, రజనీకాంత్, బాలకృష్ణ సినిమాలు విడుదల అవుతాయా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

ట్రెండింగ్ వార్తలు