Hanuman Twitter Review: ‘హనుమాన్’ ట్విట్టర్ రివ్యూ..క్లైమాక్స్‌లో గూస్‌బ‌మ్స్ ఖాయం

January 11, 2024

Hanuman Twitter Review: ‘హనుమాన్’ ట్విట్టర్ రివ్యూ..క్లైమాక్స్‌లో గూస్‌బ‌మ్స్ ఖాయం

తేజా సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వ‌హించిన సినిమా ‘హను–మాన్‌’. ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌గా రూపొందిన‌ ఈ చిత్రంలో హ‌నుమంతుడి ప్ర‌స్తావ‌న, శ‌క్తి ఉండ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అమృతా అయ్యర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్‌ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ వేశారు మేకర్స్. ఇప్పటికే హిందీలో ప్రీమియర్స్ చూసిన అడియన్స్ సినిమా అదిరి పోయిందంటూ కామెంట్స్ చేశారు. ఫెంటాస్టిక్.. అద్భుతమంటూ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

కొన్ని చోట్ల అన‌వ‌స‌ర స‌న్నివేశాలు మిన‌హా ఫస్ట్ హాఫ్ ఎక్స్‏ట్రాఆర్డీనరిగా ఉంద‌ని.. ఎక్స్‏ట్రాఆర్డీనరి విజువల్స్ తో నెక్ట్ లెవల్ సినిమాటిక్ ఎక్స్ పిరియన్స్..ఇస్తుంద‌ని సినిమా చూసిన నెటిజ‌న్లు ఖితాబు ఇస్తున్నారు. ఇక సినిమాలోని చివరి 20 సినిమాలు మాత్రం గూస్ బంప్స్ పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తేజ పర్ఫామెన్స్.. యాక్షన్ అండ్ కామెడీ చాలా బాగుందని అంటున్నారు. డైలాగ్స్, యాక్షన్, బీజీఎమ్ అదిరిపోయాని.. సినిమాకు ప్రధాన బలం తేజ యాక్టింగ్ అంటున్నారు. ఇప్పటికే సినిమా చూసి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్న అడియన్స్ చెబుతున్న విషయాలను స్వయంగా మీరే చేసేయ్యండి.

     

ట్రెండింగ్ వార్తలు