బన్నీలో ఉన్నటువంటి ఈ క్వాలిటీ చరణ్ లో లేదు తెలుసా.. గమనించారా?

March 22, 2024

బన్నీలో ఉన్నటువంటి ఈ క్వాలిటీ చరణ్ లో లేదు తెలుసా.. గమనించారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోలుగాను పాన్ ఇండియా స్టార్స్ గాను కొనసాగుతూ ఉన్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఐకాన్ సార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఒకరు చెప్పాలి. వీరిద్దరూ మెగా హీరోలుగా గుర్తింపు పొందడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అదే ఆదరణ పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఇక ఇద్దరు కూడా నటన పరంగా డాన్స్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించారు కానీ అల్లు అర్జున్ లో ఉన్నటువంటి ఒక క్వాలిటీ రామ్ చరణ్ లో లేదని తెలుస్తుంది. మరి చరణ్ లో లేనటువంటి ఆ క్వాలిటీస్ ఏంటి అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ఓపెన్ మైండెడ్ ..ఫ్యామిలీతో చాలా చిల్ అవుతూ ఉంటాడు . అంతేకాకుండా ఈయన తన భార్య స్నేహారెడ్డితో చాలా రొమాంటిక్ గా ఉంటూ దిగినటువంటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఇక చరణ్ మాత్రం బన్నీ అంత రొమాంటిక్ పర్సన్ కాదని తెలుస్తోంది. ఈయన ఏ విషయాన్ని కూడా ఓపెన్ గా చెప్పరు. ఏదైనా తన మనసులోనే ఉంచుకుంటారు అంతే కాకుండా ఉపాసనతో కలిసి ఎప్పుడు కూడా రొమాంటిక్ యాంగిల్ లో ఉన్నటువంటి ఫోటోలను ఈయన షేర్ చేయలేదు.బేబీ కన్ఫర్మ్ అయింది అని తెలిశాక ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న పిక్ మాత్రమే అలా రొమాంటిక్ గా ఉంటుంది . కానీ అది కూడా లిమిట్స్ లోనే ఉంటుంది . ఇలా రొమాన్స్ విషయంలోనూ ఏదైనా ఓపెన్ గా చెప్పే విషయంలో బన్నీకి చరణ్ సాటిరారని, బన్నీ అంత బోల్డ్ చరణ్ కాదు అంటూ జనాలు ఈ విషయంపై వీరిద్దరి గురించి చర్చలు జరుపుతున్నారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కూడా తమ తదుపరి సినిమాల పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Read More: పెళ్లికి సిద్ధమైన బర్రెలక్క.. వరుడు ఎవరో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు