ఎన్టీఆర్ సినిమా అంటే ఈ రెండు ఉండాల్సిందేనా… ఫాన్స్ కోరుకునేది అదేనా?

February 29, 2024

ఎన్టీఆర్ సినిమా అంటే ఈ రెండు ఉండాల్సిందేనా… ఫాన్స్ కోరుకునేది అదేనా?

సాధారణంగా అభిమానులు తమ హీరోల సినిమాల నుంచి కొన్ని భారీ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తమ హీరో సినిమా వచ్చింది అంటే ఈ అంశాలు తప్పకుండా ఆ సినిమాలో ఉండాలని అభిమానులు కోరుకుంటారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో కూడా అభిమానులు అదే కోరుకుంటున్నారని తెలుస్తుంది. ఎన్టీఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి.

ఇక ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా తరువాత ఒక్క సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ఫాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాలు వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో తిరిగి దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలను పెంచాయి. ఇక ఎన్టీఆర్ సినిమా అంటేనే అభిమానులలో భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమా నుంచి ప్రతి ఒక్క అభిమాని ఆసక్తిగా ఎదురుచూసే అంశాలు ఏవైనా ఉన్నాయి అంటే ఒకటి డాన్స్ రెండు ఒక యాక్షన్ సీక్వెన్స్ భారీగా ఉండాలని భావిస్తారు. ఈ రెండు ఎన్టీఆర్ సినిమాలో తప్పనిసరిగా ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటారు. ఇక ఎన్టీఆర్ కూడా వీటి పైన ఫోకస్ చేస్తారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారనే విషయం మనకు తెలుసు. ఈ క్రమంలోనే డాన్స్ కి స్కోప్ ఉంటే పాటలను రాయాలని చెబుతారట అదే విధంగా ఒక భారీ యాక్షన్ సీన్ కూడా ఉండేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది.

Read More: Varun Tej: కల్యాణ్‌ బాబాయ్‌ ఇలా చెప్పడం అరుదు: వరుణ్‌ తేజ్‌!

ట్రెండింగ్ వార్తలు