Eagle: ‘ఈగల్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఆ రెండింటిలో స్ట్రీమింగ్‌.

February 29, 2024

Eagle: ‘ఈగల్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఆ రెండింటిలో స్ట్రీమింగ్‌.

మాస్ మహారాజా రవితేజ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా సినిమా ఈగల్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను సాధించలేకపోయింది.

అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు అయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అధికారికంగా వెల్లడించింది. మార్చి 1వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. మాస్ మహారాజా ఎంటర్టైనర్ మార్చి 1 న రాబోతుందంటూ ఈటీవీ విన్ అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమా హక్కులను ఈటీవీ విన్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా దక్కించుకుంది.

ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ఈ సినిమా మార్చ్ ఒకటవ తేదీన స్ట్రీమింగ్ కి రాబోతుంది. ప్రైమ్ వీడియోలో హిందీ వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని సమాచారం.ఈగల్ చిత్రంలో రవితేజ గెటప్, యాక్షన్ సీక్వెన్స్లు అభిమానులకు తెగ నచ్చేసాయి. మాస్ మహారాజా పెర్ఫార్మెన్స్ అందరినీ మెప్పించింది. ఈ సినిమాలో వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధు శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్ కీలక పాత్రలు చేశారు

మ్యూజిక్ డైరెక్టర్ డావ్ జండ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నా పాటలు పెద్దగా పాపులర్ కాలేదు. స్టార్ సినిమాటో గ్రాఫర్ కార్తీక్ కు డైరెక్టర్ గా ఈగల్ రెండవ సినిమా. అతడి స్టైలిష్ టేకింగ్ ఫిల్మ్ మేకింగ్ అందరినీ ఆకట్టుకుంది. అయినా ఎందుకో అంచనాలను అందుకోలేక కేవలం 35 కోట్ల వసూళ్లను మాత్రమే దక్కించుకోగలిగింది. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.

Read More: ఎన్టీఆర్ సినిమా అంటే ఈ రెండు ఉండాల్సిందేనా… ఫాన్స్ కోరుకునేది అదేనా?

ట్రెండింగ్ వార్తలు