ఆ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయిన మాస్ మహారాజ?

April 9, 2024

ఆ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయిన మాస్ మహారాజ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. ఈయన నటనపై ఆసక్తి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు అనంతరం చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగారు. అనంతరం హీరోగా ఈయన సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇలా నటుడిగా సినిమా అవకాశాలను అందుకొని తనని తాను నిరూపించుకుంటూ నేడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి రవితేజ చివరిగా ఈగల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో కాకపోయినా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ తన తదుపరి చిత్రం డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నారు మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ఈయన మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ మరో రెండు సినిమాలకు ఆల్మోస్ట్ కమిట్ అయ్యారని తెలుస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఆ రెండు సినిమాలను నిర్మించనున్నారని అంటున్నారు.

ఈ బ్యానర్ లో రవితేజ ముందుగా సామజ వరగమనా మూవీకి కథని అందించిన భాను భోగవరపు దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్న మూవీని రవితేజ చేయనున్నారని, అనంతరం జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కెవితో కూడా మరొక మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాలలో భాను డైరెక్షన్లో మొదటి సినిమా రాబోతుందని సమాచారం.

Read More: విశ్వంభర సెట్ లో మెగాస్టార్ ని కలిసిన జనసేనాని.. ఐదు కోట్ల విరాళం ఇచ్చిన చిరు?

ట్రెండింగ్ వార్తలు