July 5, 2022
మలయాళంలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న ఫాహద్ ఫాజిల్ తెలుగులో ‘పుష్ప’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండుపార్టులుగా రిలీజ్ అవుతోంది. తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’లో ఫారెస్ట్ ఆఫీసర్ బన్వర్‌సింగ్ షెకావత్ పాత్రలో నటించారు ఫాహద్ ఫాజిల్. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ చేశారు. అయితే ఫస్ట్‌పార్టులో ఫాహద్ ఫాజిల్ పాత్ర సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్‌లోనే వస్తుంది. అప్పటివరకు సునీల్, అనసూయ, కన్నడ నటుడు ధనుంజయ, అజయ్ ఘోష్ విలన్స్‌గా కనిపిస్తారు. కానీ సెకండాఫ్‌లో మెయిన్ ఫైట్ అల్లు అర్జున్ వర్సెస్ ఫాహద్ ఫాజిల్ అన్నట్లుగా తొలిపార్టు పుష్ప: ది రైజ్ క్లైమాక్స్ పూర్తి అవుతుంది.
‘పుష్ప: ది రైజ్’కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ‘పుష్ప’లోని రెండోపార్టు ‘పుష్ప: ది రూల్ ’ కథపై సుకుమార్ మరింత ఫోకస్ పెట్టారు. ఇందువల్లే పుష్ప:ది రూల్ సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఫాహద్ ఫాజిల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం, ఈ పాత్రకు మరో పాపులర్ యాక్టర్‌ను వెతికే పనిలో సుకుమార్ ఉండటం వల్లే ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుందన్నది లేటెస్ట్ న్యూస్.
ఇక ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో ఫాహద్‌ఫాజిల్ పోషించిన బన్వర్‌సింగ్ పాత్రను విజయ్ సేతుపతి చేయాల్సింది కానీ కుదర్లేదు. దీంతో ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ చిత్రంలోని ఫాహద్ పాత్రనే విజయ్‌సేతుపతికి ఆఫర్ చేస్తున్నారట సుకుమార్ అండ్ కో టీమ్. మరి..విజయ్‌సేతుపతి ఒప్పుకుంటాడా? లెట్స్ వెయిడ్ అండ్ సీ. మరోవైపు తొలుత ‘పుష్ప: ది రూల్’ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్‌కు వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది.