Fighter First Day Collection: ఫైట‌ర్ మూవీ మొద‌టిరోజు ఎంత వ‌సూలు చేసిందంటే?

January 26, 2024

Fighter First Day Collection: ఫైట‌ర్ మూవీ మొద‌టిరోజు ఎంత వ‌సూలు చేసిందంటే?

హృతిక్ రోషన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఫైటర్’. దీపికా పదుకొణె హీరోయిన్‌గా న‌టించ‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో క‌నిపించారు. రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 25న ఈ సినిమా విడుద‌లైంది. ప్రీమియ‌ర్స్ నుండే ‘ఫైటర్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ లభించింది. ఫలితంగా దీనికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రానికి మొదటి రోజు రూ. 22 కోట్లు నెట్‌ వసూళ్లతో పాటు రూ. 35 కోట్లు గ్రాస్ వసూలైంది.

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన ‘ఫైటర్’ మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఇది రూ. 22 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 178 కోట్లు నెట్‌ను ఇది వసూలు చేస్తేనే హిట్ అవుతుంది.

హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మూవీ మొదటి రోజు ఆశించిన దానికంటే తక్కువ వసూళ్లనే రాబట్టింది. అయినప్పటికీ 2024లో హిందీలో ఓపెనింగ్ డేన అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో మొదటి స్థానానికి చేరింది. అయితే, 2023 – 24 సంవత్సరాల్లో వచ్చిన సినిమాలను చూసుకుంటే మాత్రం ‘ఫైటర్’ చిత్రం 7వ స్థానంలో నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Read More: ప‌ద్మ‌విభూష‌ణుడిగా మెగాస్టార్ చిరంజీవి

ట్రెండింగ్ వార్తలు